- Advertisement -
బెంగళూరు: బిజెపి ఎంపి తేజస్వీ సూర్య ఓ యువతిని వివాహం చేసుకోబోతున్నాడు. సౌత్ బెంగళూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపిగా గెలిచారు. తమిళనాడుకు చెందిన ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకురాలు, భారతనాట్య కళాకారిణి శివశ్రీ స్కందప్రసాదన్‌ను సూర్య పెళ్లి చేసుకోనున్నారు. మార్చి 24న ఆమె మెడలో ఆయన తాళి కట్టనున్నారు. మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరత నాట్యంలో ఎంఎ, మద్రాస్ సంస్కృత కాలేజీ నుంచి ఆమె పిజి చేశారు. రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా శివశ్రీ పాడిన పాటలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. దీంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
- Advertisement -