Sunday, December 22, 2024

ల్యాండ్ జాబ్స్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వికి ఊరట

- Advertisement -
- Advertisement -

ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులకు ఢిల్లీ లోని రోస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరిలో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి, తేజ్ ప్రతాప్ యాదవ్ సహా ఇతర నిందితులు ఉన్నారు. ఒక్కో నిందితుడికి రూ. లక్ష పూచీకత్తుపై ఈ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు వారిని అరెస్టు చేయకుండా చార్జిషీట్ చేసినట్టు తెలియజేసింది. నిందితులందరూ తమ పాస్‌పోర్టులను అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా దేశం విడిచి వెళ్లవద్దని సూచించింది. ఈ సందర్భంగా తేజస్వియాదవ్ మాట్లాడుతూ పలువురు వ్యక్తులు తమపై కుట్రలు చేస్తూనే ఉన్నారని ఆరోపించారు. ఈ కేసు విషయంలో తమ ప్రమేయం లేదని, తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News