Friday, April 4, 2025

ద్రౌపది ముర్ముపై తేజస్వీ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు !

- Advertisement -
- Advertisement -

Tejaswi

 

ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడిందిలేదు!…
వట్టి విగ్రహం…రాష్ట్రపతిభవన్లో మాకామె అవసరం లేదు!!

న్యూఢిల్లీ: ఎన్‌డిఏ తరఫు రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడి) నాయకుడు తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమె వంటి ప్రతిమ తమకవసరం లేదన్నారు. “మీరంతా యశ్వంత్ సిన్హా గురించి ఎల్లప్పుడూ విన్నారు. కానీ అధికార పార్టీ అభ్యర్థి అయిన ఆమె గొంతు కూడా మేము ఎప్పుడూ వినలేదు” అని ఆయన తెలిపారు. ఎన్‌డిఏ తన అభ్యర్థిగా ఆమెను ఎంపిక చేసుకున్నాక కూడా ఆమె ఒక్క విలేకరుల సమావేశం కూడా నిర్వహించలేదని దెప్పి పొడిచారు. “మీరు కూడా ఆమె మాట్లాడింది ఎక్కువ విని ఉండరు” అంటూ ఆయన విలేకరులను ఉద్దేశించి అన్నారు. యశ్వంత్ సిన్హాకే తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. అయితే విశేషం ఏమిటంటే ఆర్‌జెడికి మిత్రపక్షమైన ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) మాత్రం ద్రౌపది ముర్ముకే తమ మద్దతును ప్రకటించింది. ముర్ముపై కాంగ్రెస్ నాయకుడు అజయ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసిన కొన్ని రోజుల తర్వాత తేజస్వి యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇక్కడ గమనార్హం. అజయ్ కుమార్ మంగళవారం ‘ఎన్‌డిఏ రాష్ట్రపతి అభ్యర్థి ‘భారత దుష్ట తత్వానికి’ ప్రతీక, ఆమెను ‘ఆదివాసీ ప్రతీక’గా చూపకూడదు” అని విమర్శించారు. అయితే ముర్ముపై వారు చేసిన విమర్శలను బిజెపి ప్రతినిధి షహజాద్ పూనావాలా దుయ్యబట్టారు. వారు తమ వ్యాఖ్యానాలతో మొత్తం ఆదీవాసీ సమూహాన్నే అవమానించారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్‌ను కూడా ఆయన పోస్ట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News