Monday, December 23, 2024

ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ను కలిసిన తేజస్వీ యాదవ్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆర్ జెడి ముఖ్య నాయకుడు తేజస్వీ యాదవ్ మంగళవారం మధ్యహా్నం ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. సిఎం కెసిఆర్ ను తేజస్వీ యాదవ్ తోపాటు మాజీ మంత్రి అబ్దుల్ బరి సిద్దిఖీ, మాజీ ఎమ్మెల్యేలు సునీల్ సింగ్, భోలా యాదవ్ లు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్, రాజ్యసభ ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ లు తేజస్వీ యాదవ్ బృందానికి సాదర స్వాగతం పలికారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు విషయంపై సిఎం కెసిఆర్ తో తేజస్వీ యాదవ్ చర్చించినట్లు తెలుస్తోంది.

Tejaswi Yadav Meets CM KCR at Pragathi Bhavan 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News