Friday, December 20, 2024

తెలంగాణ గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్‌ అదనపు బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ఆమోదించారు. తెలంగాణ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలను కేంద్రం అప్పగించింది. మరికాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. పుదుచ్చేరి ఎల్‌జిగా కూడా రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 1998, 1999 లోక్ సభ ఎన్నికలలో రాధాకృష్ణన్ కోయంబత్తూరు నుంచి ఎంపిగా గెలిచారు. తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2023 ఫిబ్రవరి 12 నుంచి ఝార్ఖండ్ గవర్నర్‌గా ఆయన సేవలందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News