Wednesday, January 22, 2025

రిజర్వాయర్ల హబ్‌గా స్టేషన్ ఘన్‌పూర్

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం ఒక రిజర్వాయర్ల హబ్‌గా తయారైందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం నియోజకవర్గ కేంద్రంలోని రిజర్వాయర్ చెరువు కట్టపై తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో రైతులు, ముదిరాజ్‌లు, సకల జనులతో కలిసి కట్ట మైసమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో 46 వేల చెరువులను పునరుద్దరించడమే కాకుండా చెరువు కట్టలను మరమ్మతలు

చేయడంతో 262 టీఎంసీల నీటిని నిల్వ సామార్థాన్ని పెంచుకొని భూగర్భ జలాలను పెంచుకోవడం జరిగిందన్నారు. చెరువులన్నింటిని మూడు విడతల్లో పునరుద్దరణ చేసుకోవడం వల్ల ఆ చెరువులను దేవాదుల నీటితో నింపుకోవడం జరిగిందన్నారు. ధర్మసాగర్, ఘన్‌పూర్, గండి రామారాం, అశ్వరావుపల్లి, చీటకోడూరు, ఉప్పుగల్లు, నవాపేట రిజర్వాయర్లతో నియోజకవర్గం రిజర్వాయర్ల హబ్‌గా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, తహసీల్దారు పూల్‌సింగ్ చౌహాన్, ఏసీపీ రఘుచందర్, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News