Monday, December 23, 2024

తెలంగాణ 2కె రన్ విజయవంతం

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం టౌన్ : పట్టణంలోని లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డు నుంచి ప్రకాశం స్టేడియం వరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం 2కె రన్ నిర్వహించారు. ఈ రన్‌కు జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్‌పి.వినీత్, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ రన్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్న యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న తర్వాత సాధించిన అభివృద్ధిని దశదిశలా చాటేలా ఏర్పాటు చేసుకుంటున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

గత పది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం తీసుకొస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలు, యువతీయువకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా పండుగ వాతావరణం కనిపిస్తుందన్నారు. అనంతరం గాలిలోకి బెలూన్ వదిలి జాతీయ గీతాన్ని ఆలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News