Monday, December 23, 2024

మూడు కోట్లమంది పోరాట ఫలమే తెలంగాణ: షర్మిల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నీళ్లు నిధులు నియామకాలే లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక రాష్ట్రం కోసం మూడు కోట్ల మంది పోరాటాల ఫలమే తెలంగాణ రాష్ట్రం అని వైఎస్‌ఆర్‌తెంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శుక్రవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో షర్మిల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. తెలంగాణ సాంప్రదాయక వంటకాలు చేసి కార్యకర్తలకు పార్టీ అభిమానులకు రుచి చూపించారు.

ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలోనూ ఉద్యమ ఆకాంక్షలు, ఆశయాలు నెరవేరాలన్నారు. ప్రతిపక్షాలు అమ్ముడుపోయిన సమయంలో పుట్టిందే వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అని ,నియామకాల కోసం మొట్టమొదటగా పోరాటం చేసి గెలిచి, నిలిచామన్నారు. అన్నం మెతుకులు ముట్టకుండా నిరుద్యోగ దీక్షలతో సర్కారు మెడలు వంచి నోటిఫికేషన్లు ఇప్పించామన్నారు. వైఎస్‌ఆర్‌టిపి కాంట్రాక్టు కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పక్షాల నిలబడిందన్నారు. అక్రమ అరెస్టులతో, పోలీసు లాఠీలతో, అక్రమ నిర్బంధాలతో హింసించినా, మొక్కవోని దీక్షతో పోరాటం చేసిందని తెలిపారు. నిస్వార్థంగా ఉద్యమించింది.

3800 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టామన్నారు. రుణమాఫీ, డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, మూడెకరాల భూమి, వడ్డీ లేని రుణాలు, కేజీ టు పీజీ ఉచిత విద్యపై ప్రజల కలలు సాకారం కావాలన్నారు. మళ్లీ వ్యవసాయం పండుగ కావాలని, సొంతింటి కల నెరవేరాలని, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు కావాలని, జలయజ్ఞం ద్వారా జలసిరులు కురవాలని, అర్హులకు పోడు పట్టాలు అందాలని, పేదలకు భూములు దక్కాలని, ప్రజలు అభివృద్ధి బాట పట్టాలని, సబ్బండ వర్గాలకు సంక్షేమం చేకూరాలని షర్మిల ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News