- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు పాత్రికేయుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ తెలిపింది. సెప్టెంబర్ 30తో ముగియనున్న పాత్రికేయుల అక్రిడిటేషన్ కార్డుల గడువును మరో మూడు నెలల పొడిగించినట్లు పేర్కొన్నారు. గడువు పెంచిన కాలానికి బస్పాసులను ఆర్టీసి కేంద్రాల్లో జారీ చేస్తారని వెల్లడించారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31వరకు పెంచిన గడువు వర్తిస్తుందని తెలిపారు.
- Advertisement -