మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుపై తెలంగాణా వాదులు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో చీకట్ల నుంచి వెలుగులు విరజిమ్మిస్తున్న ట్రాన్స్‌కో అండ్ జెన్‌కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావుపై బిజెపి ఎమ్మెల్యే నోరూపారేసుకోవడంపై పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
శుక్రవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందిన సిఎండి ప్రభాకర్ రావు అంటూ బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు చులకనగా చేసిన చౌకబారు ప్రకటనపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దేశ ప్రధానికి ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న డాక్టర్ ప్రమోద్ కుమార్ మిశ్రా పుట్టింది 1948 ఆగస్టు 11వ తేదీన. 1972 సంవత్సరంలో ఆయన ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. తాజాగా సిఎండి ప్రభాకర్‌రావు రావు రఘునందన్ రావు మాట్లాడిన మాటల ప్రకారం సదరు ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ కూడా ఎప్పుడు పదవీ విరమణ చేశారో చెప్పాలని, పదవీ విరమణ పొందిన ప్రమోద్‌కుమార్ ప్రభుత్వ సర్వీసులో ఎలా ఉన్నారో తెలపాలని తెలంగాణ వాదులు బిజెపి ఎమ్మెల్యే రఘునందరావును ప్రశ్నిస్తున్నారు. కేంద్రానికి ఒక రూల్ రాష్ట్రానికి ఒక రూల్ ఉంటుందా అని వారు నిలదీస్తున్నారు.
కేంద్రంలో ఒక నీతి, రాష్ట్రానికి ఒక నీతా
ప్రధాని మోదీ ప్రధాన కార్యదర్శి విరమణ పొందింది ఎప్పుడూ…?, 1972 బ్యాచ్ కు చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ పుట్టింది 1948 ఆగస్టు 11కాదా, ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ప్రధానికీ ప్రధాన కార్యదర్శిగా చెయవచ్చా, కేంద్రంలో ఒక నీతి, రాష్ట్రానికి ఒక నీతా అంటూ నెటిజన్లు సైతం రఘునందనరావుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అడ్డంగా దొరికావు అదుపులో ఉంచుకో మీ నోరు, కాకమ్మ కబుర్లు ఆపి కాసింత వినుకో అంటూ వారు ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు చురకలు అంటిస్తున్నారు. మోదీ సొంత రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఉందా, తాత నెహ్రు, నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్, తల్లి సోనియమ్మ ఎలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కరెంట్ ఉందా…?, తెలంగాణాలో నిరంతర విద్యుత్‌పై బిజెపికి ఎందుకు అంత అక్కసు, నీ అక్కసు ముఖ్యమంత్రి కెసిఆర్ మీదనా, తెలంగాణా రైతాంగాం మీదనా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.