Sunday, December 22, 2024

నేడు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం ఉద్యమించి వివిధ స్థాయిల్లో నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకులందరూ నేడు జరిగే తెలంగాణ ఉద్యకారుల సమావేశానికి హాజరుకావాలని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని నేటి ప్రభుత్వం పై ప్రజల ఆకాంక్షల సాధన కోసం ఉద్యమించాల్సిన సమయం అసన్నమయ్యిందన్నారు. అందులో భాగంగా అందరి సలహాలు, సూచనలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ తుది దశ ఉద్యమానికి నాంది పలకాలని, అవినీతికి, అక్రమాలకు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు చేసే ఉద్యమ నిర్మాణంలో నేతలందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశం ఆదివారం (నేడు) లక్డీకాపూల్ లోని ఆశోకా హోటల్‌లో ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News