Monday, December 23, 2024

రుణమాఫీ కాని వారికి అలర్ట్.. వ్యవసాయ శాఖ కీలక అప్డేట్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీని చేసింది. అయితే.. చాలా మంది రైతులు రుణమాఫీ కాలేదని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీంతో రైతులు చేస్తున్న ఆందోళనలపై వ్యవసాయ శాఖ స్పందించింది.

‘ఆధార్, పాస్‌బుక్, రేషన్‌కార్డు వివరాలు సరిగా లేనివారి రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. రైతులు వ్యవసాయ అధికారులను కలిసి, వివరాలు సరిచేసుకుంటే సొమ్ము ఖాతాల్లో జమ అవుతుంది. సాంకేతిక కారణాలతో కొందరి మాఫీ డబ్బులు వెనక్కి వచ్చాయి. మళ్లీ జమ చేశాం. రైతులు ఫిర్యాదు చేస్తే నెలలోగా పరిశీలించి, అర్హులకు మాఫీ వర్తింపజేస్తాం’ అని ప్రకటించింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా స్పందిస్తూ.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ తప్పకుండా రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News