మనతెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్రలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల సరిహద్దుల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు గ్రామాల అడ్డదారులు మూసివేశారు. మహారాష్ట్ర నుంచి అక్కడి ప్రజలు వాహనాలపై కాలిబాటన అడ్డదారుల్లో జిల్లాలో ప్రవేశిస్తున్నారని దీంతో కేసులు పెరుగుతున్నాయని తహసీల్దార్ వెంకట్రావు తెలిపారు. ఆ రాష్ట్రం నుంచి వచ్చి వెళ్లేవారు ప్రధాన రహదారి గుండా వెళ్లాలని సూచించారు. అడ్డదారులు మూసివేశామని ఆయన పేర్కొన్నారు. అడ్డదారుల్లో ముళ్ల కంచెలతో దారి మూసివేత మండలంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా సరిహద్దు గ్రామాల నుంచి మహారాష్ట్రకు వెళ్లే దారుల్లో ముళ్లకంపలు వేసి రాకపోకలు నిలిపివేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ప్రధాన రహదారి మీదుగా రావడం వల్ల సరిహద్దు వద్ద తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశామని వెంకట్రావు తెలిపారు. అక్కడ స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతే ప్రయాణికులకు అనుమతిస్తున్నారు.
Telangana alerts border villages amid corona surge