Sunday, December 22, 2024

అమరుల స్మృతి మందిరం

- Advertisement -
- Advertisement -

60 ఏండ్ల కళ ఎన్నో బలి దానాలు, ఆత్మహత్యలు, విద్యార్థుల నిరసనలు, అట్టుడికిన విశ్వవిద్యాలయాలు, ఉద్యమాల ఊపిరిలో ఆవేశపు అంచులలో అణచివేసిన యుద్దంలో గళమెత్తిన గొంతులతో గర్జించే గలముతో సాధించిన సమరంలో అసువులు బాసిన యువ కెరటం ప్రాణాలతో పోరాటం రగిలిన అగ్నిగుండమై నాలుగు కోట్ల జన సమూహమై వినబడిన పదమే ‘జై తెలంగాణ’ ప్రాణాలను అర్పిస్తే మిగిలేది బూడిద, పౌరుషంతో పోరాడితే వచ్చింది రా తెలంగాణ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969లో జరిగిన తొలి ఉద్యమంతో పాటు మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది ప్రాణాలు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచేందుకు శాశ్వత స్మృతి చిహ్నాన్ని ప్రభుత్వం నిర్మించింది.

Also Read: రోజుకో మలుపు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమరవీరుల స్మృత్యర్థం అత్యాధునిక స్మారక భవనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్మారక భవనంలో తెలంగాణ చరిత్రకు సంబంధించిన సకల వివరాలను తెలియజేసేలా ఏర్పాటు చేశారు. ఐదు అంతస్తుల్లో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణాన్ని 42 మీటర్ల ఎత్తులో 10,300 చ.మీ. విస్తీర్ణంలో భవనమంతటా ఎసి సౌకర్యంతో పాటు మూడు లిస్ట్లు కూడా ఉంటాయి. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ భవన నిర్మాణంలో రోజూ 200 మంది వరకు పని చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వివిధ రకాల వర్క్ షాపులు నిర్వహించుకునేందుకు అనువుగా ఏర్పాట్లు చేసారు. 10,656 చదరపు అడుగులతో నిర్మిస్తున్న మొదటి అంతస్తులో తెలంగాణ మ్యూజియం, అమరుల ఫోటో గ్యాలరీ, ఆడియో విజువల్ రూమును ఏర్పాటు చేశారు.

16,964 చదరపు అడుగుల నిర్మాణం ఉండే రెందో అంతస్తులో కన్వెన్షన్ హాలు, 8,095 చదరపు అడుగులు ఉండే మూడవ అంతస్తులో రెస్టారెంట్, హుస్సేన్ సాగర్ సమీపంలోని పర్యాటక అందాలను చూడటానికి వ్యూ పాయింట్, రెస్టారెంటు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్ర, తెలంగాణ మహానుభావులకు సంబంధించిన ఫోటోలు, ఇతర రూపాల్లో తెలియజేయడానికి ఏర్పాట్లు చేశారు. ఈ భవనం చుట్టూ పచ్చదనంతో కూడిన అతి పెద్ద పార్కును ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు తెలంగాణ చరిత్ర తెలుసుకోవడమే కాకుండా ఇక్కడ కొంతసేపు సేదదీరేలా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 1200 టన్నుల స్టీల్‌తో మొదటి నుంచి చివరి అంతస్తు వరకు అమరజ్యోతి నిర్మాణం జరుగుతోంది. పైన 54 x 37 మీటర్ల ప్రమిద ఉంటుంది. ఈ ప్రమిదపై 26 మీటర్ల ఎత్తున వెలుగుతున్న జ్యోతిని నిర్మిస్తున్నారు.

ఈ జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. మూడో అంతస్తు నుండి అమరుల జ్యోతికి నివాళులు అర్పించడం, ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణంగా ఈ అమరజ్యోతి అరుదైన రికార్డ్ సృష్టించబోతంది. 3.29 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈవైవిధ్య నిర్మాణం అంచనా వ్యయం రూ. 179 కోట్లు. 48 మీటర్ల ఎత్తులో, 50 మీటర్ల వెడల్పుతో, 28 అడుగుల లోతు లో మూడు అంతస్తులతో వెలుగుతున్న జ్యోతి రూపంలో తెలంగాణ అమరవీరుల స్థూపం ఆకట్టుకోనుంది. అమరుల జ్యోతి చుట్టూ ప్రదక్షిణలు చేయవచ్చు. ఎటువంటి అతుకులు లేకుండా జ్యోతి భారీ ప్రమిదను పోలిన ఆకారంలో కనిపించడం ఈ నిర్మాణం మరో ప్రత్యేకత. ప్రమిదకు ముందు భాగంలో వెలుగుతున్న ఒత్తి ఆకారంలో ఎత్తైన నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ కానుంది.

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ కట్టడం లోపలి భాగంలో మూడు అంతస్తులు నిర్మించి మొదటి అంతస్తులో మ్యూజియం, రెండో అంతుస్తులో కన్వెషన్ హాల్, మూడో అంతస్తులో దీపాకార్ని దర్శించేలా ప్రత్యేకంగా నిర్మాణం రూపొందించారు. అమరజ్యోతిని ఆనుకుని బయటవైపు చుట్టూ ఆహ్లాదకరమైన గ్రీనరీతో కూడిన పార్క్‌పై నుంచి కిందకు జూలువారతున్న నీటి ప్రవాహం అందాలు, మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. శంకుస్టాపన చేసిన నాటి నుంచి ఎంతో మంది శిల్పులు ఇచ్చిన తెలంగాణ అమరుల స్థూపం నమూనాలను పరిశీలించిన ప్రభుత్వం వెంకట రమణారెడ్డి రూపొందించిన నమూనాను ఎంపిక చేశారు. తొలి దశ ఉద్యమంలో తొలి అమరుడైన శంకర్ నుండి మలిదశ ఉద్యమంలో చివరి వరకు పోరాడిన కాసోజు శ్రీకాంతా చారి లాంటి 1200 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఈ స్మృతి మందిరం అంకితం.

పేర్వాల నరేష్
(nareshchintu111@gmail.co)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News