మన తెలంగాణ/హైదరాబాద్ : అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంగా దూసుకపోతున్నదని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అన్నారు. ఇది ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దార్శనిక నాయకత్వం…దూరదృష్టి కారణంగానే సాధ్యమైందన్నారు. పాలనలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారన్నారు. సామాన్య ప్రజల నుంచి మొదలుకుని మేధావి వర్గాలను కలుపుకుని పాలన సాగించడం వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దగలిగారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం ఆమె తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి మొదలుకుని 2018…2019వ ఆర్ధిక సంవత్సరం వరకు దేశంలో ఏ రాష్ట్రం కూడా నమోదు చేయని విధంగా స్థూల ఉత్పత్తిని 16.1 శాతానికి తీసుకెళ్లిన ఘనత ఒక్క కెసిఆర్‌కే దక్కిందన్నారు. కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలోనే రాష్ట్ర ప్రగతిని సూచికగా స్థూల ఉత్పత్తి నిలిచిందన్నారు.