Wednesday, January 22, 2025

ఒడిఎఫ్ రాష్ట్రంగా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

మరో అరుదైన ఘనత
సాధించిన రాష్ట్రం

మరో అరుదైన ఘనత ముందర తెలంగాణ

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం నుంచి అనేక అవార్డులు, ప్రశంసలను అందుకుంటున్న తెలంగాణ రాష్ట్రం మరో అరుదైన రికార్డు ముందర నిలిచింది. త్వరలోనే తెలంగాణ వందశాతం బహిరంగ మల విసర్జన రహిత (ఓడిఎఫ్) రాష్ట్రంగా మారనుంది. ఇందులో దేశంలోనే మన రాష్ట్రం ఇప్పటికే అగ్రగామిగా కొనసాగుతోంది. మరో మూడు గ్రామాలకు ఓడిఎఫ్ సౌకర్యాన్ని విస్తరిస్తే… దేశంలోనే వంద శాతం సాధించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందనుంది రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామాలు ఉండగా, 12,766 గ్రామాలు ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా మారాయి. అంటే ప్రస్తుతం 99.98 శాతం గ్రామాలకు మల విసర్జన రహిత సౌకర్యాన్ని కల్పించి టాప్ ప్లేస్‌లో తెలంగాణ దూసకపోతున్నది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత గ్రామాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీంతో పల్లెలు శరవేగంగా అభివృద్ధిగా దిశగా పరుగులు పెడుతున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 20 ఉత్తమ గ్రామాల్లోనూ తెలంగాణ నుంచి 19 గ్రామాలు ఉండడం విశేషం. ఇలా గ్రామీణాభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతూ అనేక అంశాల్ల్లో నంబర్ వన్‌గా నిలిచి ఎన్నో అవార్డులను తెలంగాణ తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం పారిశ్రామికంగానే కాకుండా తలసరి ఆదాయం, పన్నుల రాబడి, జిడిపి తదితర అంశాల్లో దేశంలోనే మన రాష్ట్రం అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన కేవలం ఎనిమిది సంవత్సరాల్లోనే దేశంలో ఇతర రాష్ట్రాలు అబ్బరుపడే రీతిలో కీలకమైన అన్ని రంగాల్లో అగ్రగామి రాష్ట్రంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో అనేక రాష్ట్రాలు తెలంగాణతో పోటీ పడలేనంత ముందు వరసలో దూసుకపోతోంది. ఇదే క్రమంలో ఓడిఎఫ్ ప్లస్‌లో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్రాల కంటే ఉత్తమ ఫలితాలు సాధించి అగ్ర స్థానంలో నిలిచింది.

2024.. 2025 నాటికల్లా సంపూర్ణ స్వచ్ఛభారత్ సాధించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న కేంద్రం ఆశయాలను నెరవేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి వరసలో ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వంద శాతం ఇళ్లకు తాగునీరు అందించే టాప్ మూడు రాష్ట్రాల్లోనూ తెలంగాణకు స్థానం దక్కింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర జల శాఖ ఈ విషయాన్ని అధికారికంగా పేర్కొన్న విషయం తెలిసిందే. రాష్ట్రాల పరంగా చూస్తే గోవా,తెలంగాణ, హరియాణ ఉన్నాయి. అయితే డబుల్ ఇంజన్ ఉన్న రాష్ట్రాల్లో (బిజెపి పాలిత రాష్ట్రాలు) మాత్రం వీటిల్లో చాలా వెనుకబడి ఉండడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News