Friday, November 22, 2024

బాడ్మింటన్ హబ్‌గా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

యువ క్రీడా ప్రతిభకు కెసిఆర్ ప్రభుత్వం ప్రోత్సాహం
శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్ వెల్లడి

మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రపంచంలోనే బ్యాడ్మింటన్ క్రీడకు తెలంగాణ రాష్ట్రం హబ్‌గా మారిందని అనేకమంది యువ క్రీడాకారులు సాధిస్తున్న విజయాలు,చూపిస్తున్న ఆసక్తి ఈ విషయాన్ని స్పష్టం చేస్తుందని స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ‘ఆల్ ఇంగ్లాండ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2023’లో విజయాలు సాధించిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన హైదరాబాద్ క్రీడాకారులు రక్షా కందస్వామి, స్థితప్రజ్ఞ, అభిషేక్ కనపాలలను ఆయన శుక్రవారం తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్న రక్ష కందస్వామి, అభిషేక్, స్థితప్రజ్ఞలకు మంచి భవిష్యత్తు ఉందని ఖచ్చితంగా వారు భవిష్యత్తులో ఒలంపిక్స్ మెడల్స్ సాధించి రాష్ట్రానికి పేరు తెస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాదులో ఉన్న అంతర్జాతీయ స్థాయి క్రీడా సదుపాయాల ద్వారా ఔత్సాహిక క్రీడాకారులకు ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ క్రీడా ప్రోత్సాహక విధానాల వల్ల యువ క్రీడాకారులు క్రీడల పట్ల ఆసక్తి చూపించడం, తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించడం జరుగుతుంతోని ఆయన గుర్తు చేశారు. క్రీడల ప్రోత్సాహానికి ఢల్లీ పబ్లిక్ స్కూల్ ఇస్తున్న ప్రోత్సాహం అభినందనీయమని, క్రీడా కార్యక్రమాలకు చేయూతనందిస్తున్న ఛైర్మన్ కొమురయ్య,సీఈవో యశస్విలను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ క్రీడాకారుల ప్రతిభను ఆంజనేయ గౌడ్ వివరిస్తూ ..రక్ష కందసామి విజయాల్లో ఆల్ ఇంగ్లండ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ – 2023లో రజత పతకం, బల్గేరియన్ జేఆర్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ – 2023లో బంగారు పతకం (ప్రపంచ ర్యాంక్ 9), ఎస్. స్థితప్రజ్ఞ విజయాల్లో ఐబిఈఆర్‌డిఓఎల్‌ఏ స్పానిష్ జూనియర్ ఇంటర్నేషనల్ – 2023లో సిల్వర్ మెడల్, కాంస్య పతకం బల్గేరియన్ JR ఓపెన్ ఛాంపియన్‌షిప్ – 2023, (ప్రపంచ ర్యాంక్ 38), అభిషేక్ కనపాల విజయాల్లో బల్గేరియన్ జేఆర్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ – 2023లో సిల్వర్ మెడల్, (ప్రపంచ ర్యాంక్ 138) ఉన్నాయని ఆంజనేయగౌడ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, ఢల్లీ పబ్లిక్ స్కూల్ క్రీడా సలహాదారు వెంకటేశ్వర్ రెడ్డి ఎంకె బ్యాడ్మింటన్ అకాడమీ చీఫ్ కోచ్ వికాస్ హర్ష తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News