Saturday, November 16, 2024

త్వరలోనే క్రీడా హబ్‌గా తెలంగాణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం త్వరలోనే క్రీడా హబ్‌గా మారబోతోందని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాల కూడా హైదరాబాద్‌లో సొంతంగా ఒక అకాడమినీ ఏర్పాటు చేసి దాదాపు వేల మందిని క్రీడాకారులను తయారు చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 17 వేల గ్రామాల్లో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే ఆయా గ్రామాల్లో క్రీడా సామాగ్రిని అందుబాటులో తెస్తామన్నారు. ప్రతినియోజకవర్గంలో స్టేడియంలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒలింపిక్ క్రీడాకారులు దేశానికే పేరు తెస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని జ్వాలా గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్‌లో పంజాబ్ జట్టు జ్వాలాగుత్తా అకాడమి ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నెల రోజుల శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసిన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్‌తో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారిని ఈ సందర్బంగా అభినందించారు.

బ్యాడ్మింటన్ ఛాంపియన్ జ్వాలా తన అద్భుతమైన కెరీర్‌ను ఎంచుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లు, బహుళ-క్రీడా ఈవెంట్‌లలో అనేక పతకాలను గెలుచుకుని తెలంగాణకే కాకుండా యావత్ భారత దేశానికి పేరు తెచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ కోచ్ , పద్మశ్రీ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరిఫ్ సర్ (అరిఫ్ సాహబ్), ఇతర ప్రఖ్యాత కోచ్‌ల మార్గదర్శకత్వంలో 1 నెల పాటు శిక్షణ పొందిన 34 మంది ఔత్సాహిక బ్యాడ్మింటన్ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను మంత్రి శ్రీనివాస్‌వాస్ గౌడ్ అభినందించారు. క్రీడల్లో రాణించాలంటే క్రమశిక్షణ, కఠోర శ్రమ, అంకితభావం వంటి వాటి ప్రాముఖ్యత గురించి ఈ సందర్భంగా గుత్తా జ్వాల తన ప్రసంగంలో వెల్లడించారు. పంజాబ్ ప్రభుత్వం కూడా తమ అకాడమికి మద్దతు తెలపడం పట్ల ధన్యవాదములు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News