Monday, December 23, 2024

ముస్లింలు మీ సొంతం కాదు: అక్బరుద్దీన్ కు సిఎం రేవంత్ కౌంటర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్.. అజారుద్దీన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. అక్బరుద్దీన్ ఓడించే ప్రయత్నం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో విద్యుత్ పై వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

“అక్బరుద్దీన్ సహచర ఎమ్మెల్యేలను గౌరవించాలి. అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ ను చేశాం. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అక్బరుద్దీన్ కేవలం ఎంఐఎం అధినేత మాత్రమే. ఎంఐఎం అనేది ఒక పార్టీ మాత్రమే. ముస్లింలు మీ సొంతం కాదు. అక్బరుద్దీన్ ను మేం ముస్లిం ప్రతినిధిగా చూడట్లేదు. చాంద్రాయణగుట్టలో హిదువులు కూడా అక్బరుద్దీన్ కు ఓటు వేశారు. మాకు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అనే తేడా లేదు. విద్యుత్ బిల్లులు ఎగవేతలో సిద్దిపేట మొదటిస్థానంలో ఉంది. గజ్వేల్ రెండో స్థానం, హైదరాబాద్ సౌత్ మూడో స్థానంలో ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి ఎన్నికైన వారే గత తొమ్మిదేళ్లలో తెలంగాణను పాలించారు. బిఆర్ఎస్, ఎంఐఎం వేరు కాదు.. ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని పాలించారు” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News