Tuesday, February 4, 2025

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రారంభమైంది. అయితే.. శాసన సభ ప్రారంభం కాగానే సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేబినెట్‌ భేటీ దృష్ట్యా సభ వాయిదా వేయాలని స్పీకర్ ను కోరారు. కేబినెట్‌ సమావేశం కొనసాగుతుందని.. నోట్స్‌, మినిట్స్‌ తయారీకి సమయం పడుతుందని.. కాబట్టి, సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరారు. దీంతో శాసనసభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News