- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : గులాబ్ తుపాన్, భారీ వర్షాల దృష్టా తెలంగాణ అసెంబ్లీని మూడు రోజుల పాటు వాయిదా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు 28న ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి విదితమే. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరూ తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ఉండి వర్షాలు, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ప్రజా ప్రతినిధులందరూ రాజధానికి పరమితం కావల్సి ఉంటుంది. కావున అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు వాయిదా వేశారు. దీంతో ప్రజా ప్రతనిధులందరూ తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు ఉభయసభలు తిరిగి సమావేశం కానున్నాయి.
- Advertisement -