Sunday, December 22, 2024

సోమవారానికి అసెంబ్లీ వాయిదా

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అసెంబ్లీలో బడ్జెట్ ను డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ. 2,75,891.ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

గృహజ్యోతి పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం రాష్ట్రానికి శాపంగా మారిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. రూ. లక్షల కోట్ల ఖర్చుతో అవినీతి ఎంతో తేల్చాల్సి ఉందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచాణ జరిపిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. నంది అవార్డును గద్దర్ అవార్డు పేరుతో చిత్ర, టీవీ కళాకారులకు అందజేస్తామన్నారు. ప్రజాయుద్ధనౌక గద్దరన్నకు మేమిచ్చే నివాళి ఇది అని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News