- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. సోమవారం రాష్ట్ర శాసన సభలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు బడ్జెట్ 2022-23ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఉదయం 11.30 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు మధ్యాహ్నం 1.30 గంటలకు ముగించారు. రెండు గంటల పాటు మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను చదివి వినిపించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
Telangana Assembly Adjourned to Wednesday
- Advertisement -