Sunday, January 19, 2025

నిరసనల మధ్య మూడు బిల్లులకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్శిటీ, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, స్టేట్ జిఎస్‌టి సవరణ బిల్లులకు
అసెంబ్లీ ఆమోదం లగచర్ల ఘటనపై చర్చించాలని విపక్షాల పట్టు వాయిదా తీర్మానాల కోసం బిఆర్‌ఎస్,
బిజెపిల ఒత్తిడి నిరసన హోరులతో దద్దరిల్లిన సభ నేటికి సభను వాయిదా వేసిన స్పీకర్ లగచర్ల రైతుకు బేడీలు వేయడంపై బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల వినూత్న నిరసన నల్ల చొక్కాలు, చేతులకు బేడీలతో
అసెంబ్లీకి హాజరు నిరసనలోనూ దొరతనమే : మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

మన తెలంగాణ అసెంబ్లీ పలు కీలక బిల్లులను ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య ఆమోదం తెలిపింది. ఈ బిల్లుల్లో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ బి ల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, స్టేట్ జీఎస్టీ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ స్పోర్ట్ వర్సిటీ బిల్లు ను మంత్రి కొండా సురేఖ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బిఆర్‌ఎస్, బిజెపి సభ్యుల నిరసనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుల కు ఆమోదం తెలిపింది. టూరిజంపై శాసనసభలో స్వల్పకాలిక చ ర్చ జరుగుతుండగా బిఆర్‌ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. స భ్యుల ఆందోళనల మధ్య వివిధ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. కాగా, లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షా లు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బిఆర్‌ఎస్, బిజెపిలు డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగినప్పటికీ నిరసనల మధ్యే ఈ మూడు కీలక బిల్లులను సభ ఆమోదించడం విశేషం. తెలంగాణ పర్యాటక విధానంపై కొద్దిసేపు చర్చ జరిపిన అనంతరం సభను స్పీకర్ ప్రసాద్‌కుమార్ బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి నేడు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నట్టు స్పీకర్ తెలిపారు.

స్పోర్ట్ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు
రాష్ట్రంలో స్పోర్ట్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్సిటీ అని పేరు పెట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్ హబ్‌కు మద్ధతుగా ఈ స్పోర్ట్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటు చేసే క్యాంపస్‌లో ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలతో మౌలిక వసలతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పోర్ట్ యూనివర్సిటీలో దాదాపు 13 కోర్సులు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అలాగే స్పోర్ట్ సైన్స్ సెంటర్, స్పోరట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు. గచ్చిబౌలి స్పోరట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోరట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News