- Advertisement -
బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు అసెంబ్లీ బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. చివరిరోజైనా ఆదివారం ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ జరుగనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడనున్నారు. నిన్నంతా ప్రాజెక్టులపై మాటల మంటలు చెలరేగాయి. ప్రతిపక్షాల విమర్శలకు సిఎం కెసిఆర్ జవాబు చెప్పనున్నారు. ఇవాళ ఉదయం మండలి ప్రారంభంకాగానే డిప్యూటీ చైర్మెన్‌ను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అధికారికంగా ప్రకటించి ఆయనకు బాధ్యతలు అప్పగించనున్నారు.
- Advertisement -