Sunday, November 3, 2024

త్వరలోనే రాష్ట్ర గీతాన్ని ప్రకటిస్తాం : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Telangana Assembly Budget Session 2021

హైదరాబాద్: గత వారంరోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగున్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఉభ‌యస‌భ‌ల‌ను ఉద్దేశించి గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చ‌ర్చ సంద‌ర్భంగా సిఎం మాట్లాడారు. నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా ప్రార్థనా స్థలాలను వాటి స్థానంలోనే నిర్మిస్తామని స్పష్టం చేశారు. రేషన్ కార్డులు గణనీయంగా పెంచామన్నారు. రేషన్ కార్డులు గతంలో 29లక్షలు ఉంటే, ఇప్పుడు 39 లక్షల మందికి కార్డులు మంజూరు చేసినట్టు సిఎం తెలిపారు. గతంలో 29లక్షల మందికి పింఛన్లు ఉంటే ఇప్పుడు 39లక్షల మందికి ఇస్తున్నామని గుర్తు చేశారు. గతంలో ఒక్కొక్కరికి 4 కిలోల చొప్పున కుటుంబంలో నలుగురికే బియ్యం ఇచ్చేవాళ్లు, ఇప్పుడు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలోని అందిరికి బియ్యం ఇస్తున్నామని కెసిఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నాం. రాష్ట్ర గీతం లేదు, త్వరలోనే రాష్ట్ర గీతాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. మంత్రి మండలి ఆమోదించిన ప్రసంగాన్నే గవర్నర్ చదువుతారని సిఎం వెల్లడించారు.

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఇదే సంప్రదాయం ఉందన్నారు. గవర్నర్ ప్రసంగం కాపీ చాలా పెద్దగా ఉందని భట్టి విక్రమార్క అన్న విషయాన్ని సిఎం గుర్తు చేస్తూ.. చేసింది చాలా ఉంది కాబట్టే ఆ మాత్రం ఉందని సిఎం కౌంటర్ ఇచ్చారు. ఎఫ్ఆర్ బిఎం పరిధికి లోబడి అప్పులు తీసుకున్నం. అప్పులను క్యాపిటల్ ఎక్స్ పెండేచర్ కు ఉపయోగిస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అన్నారు. కేంద్రం, కాగ్ ఈ విషయాన్ని చెప్పినా భట్టి దృష్టికి ఎందుకు రాలేదోనని వ్యాఖ్యనించారు. వరిధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ నెం 1 లో ఉందని సిఎం తెలిపారు. ఈ యాసంగిలో 52.28 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. కాంగ్రెస్ హయాంలో నీళ్లు ఇవ్వకున్నా నీటి తీరువా ముక్కు పిండి వసూలు చేసేవాళ్లు, తమ ప్రభుత్వం రూ. 120కోట్లకు పైగా నీటి తీరువా రద్దు చేశామన్నారు. వ్యవసాయానికి 24గంటలు నాణ్యమైన కరెంట్ ఉచితంగా సరఫరా చేస్తున్నాం. కనెక్షన్లు లేని రైతులు కూడా వరద కాలువలపై మోటర్లు పెట్టి పారించుకుంటున్నారు.

సూర్యాపేటకు కాకతీయ కాలువ నీళ్లు వస్తాయని ఎవరైనా ఊహించారా? ప్రశ్నించారు. ఫసల్ బీమా యోజనకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్న సిఎం.. రైతులకు రుణమాఫీ 100శాతం చేసి తీరుతామని చెప్పారు. తెలంగాణ అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టులను రీ డిజైన్ చేశామని సిఎం తెలిపారు. గత సంవత్సరం రూ. 25 వేల వరకు రుణాలు మాఫీ చేశాం. పోడు భూముల సమస్య పరిష్కరిస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని మరింత మెరుగుపరిచామన్నారు. సబ్ ప్లాన్ ఖర్చు వివరాలను అణా పైసతో సహా చెబుతామని తెలిపారు. 6 ఏళ్లలో పెట్రోల్, డిజిల్ పై పన్ను ఒకేసారి స్వల్పంగా పెంచమన్నారు. రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం 2వేల 71 యూనిట్ల కు పెంచినాం. తెలంగాణలో 4,840 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర ప్రజలకు 100 శాతం ఆవాసాలకు మంచి నీరు అందిస్తున్నాం. జూబ్లీహిల్స్ లో ఇచ్చే మంచి నీరే గోండు గూడేలకు కూడా అందిస్తున్నాం. 5 ఏళ్లలో కొత్తాగా 19,232 మంచి నీటి ట్యాంకులు కట్టించామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News