హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి ఒక విప్లవాత్మక కార్యక్రమమని సిఎం కెసిఆర్ అసెంబ్లీలో అన్నారు. భూ రికార్డులు ఎక్కడైతే క్లియర్ గా ఉన్నాయో.. అక్కడ జిడిపి 3 నుంచి 4 శాతం పెరుగుతుందని సిఎం పేర్కొన్నారు. ఒకనాడు వీఆర్ వో రాసింది రాత… ఎమ్మోర్వో గీసింది గీత అన్నట్లుగా ఉండేది. ఒకరి భూములను ఒకరికి రాసేవారని చెప్పారు. భూముల మార్పిడిలో ఎంతో గందరగోళం ఉండేదన్నారు. రాష్ట్రంలో కోటి 60 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. కోటి 50 లక్షల ఎకరాలు ధరణిలోకి ఎక్కాయన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత అక్కడికక్కడే టెంపర్వరీ పాస్ బుక్, పది రోజుల్లో ఒరిజినల్ పాస్ బుక్ ఇంటికి పంపిస్తారని సిఎం చెప్పారు. ఎమ్మోర్వో కార్యాలయంలో భూ రికార్డులను మార్చొద్దన్నదే టిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవన్నారు. ధరణి ప్రజలకు వరంగా మారితే.. అవినీతి పరులకు అశనిపాతంగా మారిందన్నారు. అక్షాంశాలు, రేఖాంశాలతో సహా భూ హద్దులు నిర్ణయించి రైతులకు ఇస్తామని సిఎం తెలిపారు.
ధరణి ఒక విప్లవాత్మక కార్యక్రమం: సిఎం కెసిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -