హైదరాబాద్: ద్రవ్యవినిమయ బిల్లును సిఎం కెసిఆర్ సభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యవినిమయ బిల్లుపై శాసనసభలో మంగళవారం చర్చ జరుగుతోంది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు ముఖ్యమంత్రి కెసిఆర్ సమాధానం ఇస్తున్నారు. చట్టసభల్లో చర్చల సరళి మెరుగుపడాల్సిన అవసరం ఉందని సిఎం అన్నారు. ప్రజాస్వామ్యం పరిణితి చెందే క్రమంలో మరింత మెరుగుపడాలని ఆయన ఆకాక్షించారు. సమకాలీన, సామాజిక ధోరణులపై సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ అంటే అంకెల గారడీ అనే అభిప్రాయం దేశంలో ప్రబలి ఉందని సిఎం పేర్కొన్నారు. పార్లమెంటు, రాష్ట్రాల్లో బడ్జెట్ ప్రవేశపెడితే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోందని కెసిఆర్ తెలిపారు. బడ్జెట్ అద్భుతంగా ఉందని అధికారపక్ష నేతలు చెబుతుంటారు. బడ్జెట్ పసలేదని విపక్ష నేతలు తమ అభిప్రాయం చెబుతారని అన్నారు. ఏళ్ల తరబడి ఇదే విధమైన ధోరణి కొనసాగుతోంది. సమకూర్చకున్న నిధుల వినియోగంపై అభివృద్ధి ఆదారపడి ఉంటుంది. ప్రపంచంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోందని కెసిఆర్ అన్నారు.