Sunday, January 19, 2025

అంతా రెఢీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రశాంతంగా,అర్ధవంతంగా జరిపించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈనెల 8వ తేదీ నుంచి ప్రా రంభం కానున్న శాసనసభ సమావేశాల్లో ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు అయిదు లేదా ఏడు రోజులపాటు నిర్వహించే అవకాశాలున్నాయని అధికారవర్గా ల సమాచారం. అసెంబ్లీ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా పరిగణిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలకమైన నిర్ణయా లు తీసుకొంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెడుతున్నందున ఎక్కువ రోజులు సభను జరపడమెందుకులే… అని ప్రభు త్వ పెద్దలు భావించారని వివరించారు. అయితే ఈ సారి అ సెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయని, అధికార, వి పక్షాల మధ్య మాటల యుద్దం తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. కృష్ణానది జలాల తరలింపు, ప్రాజెక్టులను బోర్డు అప్పగించినట్లుగా తలెత్తిన వివాదం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబా టు,అవినీతి, అక్రమాలు,అప్పుల తరువాయి ఊబిలోకి రాష్ట్ర ప్రభుత్వా న్ని నెట్టివేశారనే అంశాలపై ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలని అధికారపార్టీ భారీగా కసరత్తులు చేసిందని,

మంత్రులకు కూడా తగిన సమాచారాన్ని కూడా ఇచ్చామని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. అంతేగాక ఇటీవల తలెత్తిన వివాదాలన్నింటిపైన మంత్రులకు తగిన సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వివాదాస్పదమైన అంశాలపైన సమీక్షా సమావేశాల్లో తర్ఫీదును కూడా ఇచ్చామని వివరించారు. తొలుత పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సభను కనీసం 18 రోజులపాటు నిర్వహించాలని భావించారని, కానీ బడ్జెట్‌పై నిపుణులతో చర్చోపచర్చలు జరిపిన తర్వాత ఓట్ ఆన్ అకౌంట్‌కు మారినందున కొద్దిరోజులపాటు సభలను నిర్వహించుకొంటే సరిపొతుందని ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చిందని తెలిపారు. సభలను ఎన్ని రోజులు జరపాలనే అంశాలపై ఈనెల 8వ తేదీన ఉదయం 11.30 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుందని వివరించారు. ఆ తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరగబోయే బిఏసి సమావేశంలో సభలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాన్ని ఖరారు చేస్తారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులు, సభ్యులకు వివిధ మంత్రిత్వశాఖల నుంచి రావాల్సిన వివరాలను అందించేందుకు,

అన్ని శాఖలను సమన్వయం చేసుకునేందుకు వీలుగా ఒక ఐఎఎస్ అధికారిని కో-ఆర్డినేటర్‌గా నియమించాలని నిర్ణయించారు. అందుచేతనే సభ్యులు అడిగిన ప్రశ్నలకు సకాలంలో జవాబులు రావడమే కాకుండా మంత్రులకు కూడా తగిన సమాచారం కూడా వెంటవెంటనే అందించేందుకు వీలవుతుందని ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్లుగా శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు తెలిపారు. అంతేగాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉభయ సభల్లో నూతనంగా ప్రవేశించిన కొత్త సభ్యులకు సభల్లో వ్యవహరించాల్సిన తీరుతెన్నులపైన సమగ్రమైన అవగాహన కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత రెండు రోజులపాటు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నట్లుగా మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. దాని మూలంగా తమతమ నియోజకవర్గాల సమగ్రాభివృద్దికి తగిన విధంగా ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించాలన్నా, సమకాలీన అంశాలపైన, ఉభయ సభల్లో వివిధ అంశాలపై జరిగే చర్చల్లో పాల్గొనేందుకు అనుసరించాల్సిన సభా మర్యాదలు, సభా సంప్రదాయాలను కూడా నూతన సభ్యులకు కూలంకషంగా వివరించడానికి ఈ ఓరియంటేషన్ క్లాసులు ఇతోధికంగా ఉపకరిస్తాయని మంత్రి తెలిపారు. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలను అత్యంత పగడ్బందీగా నిర్వహించడానికి భద్రతా ఏర్పాట్లు, ఇతరత్రా అనేక అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం

అసెంబ్లీ సమావేశ మందిరంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనసభా వ్యవహారాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబులు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, డిజిపి రవిగుప్త, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, ముగ్గురు పోలీస్ కమీషనర్లు, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను త్వరితగతిన అందించాలని సూచించారు. సమావేశాల సమయంలో సంబంధిత అధికారులు తప్పకుండా అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న శాసనమండలిని త్వరగా పాత అసెంబ్లీ భవనంలోకి మార్చాలని, అందుకు తగినట్లుగా మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చైర్మన్ కోరారు. మండలి షిప్టింగ్ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి తగిన తోడ్పాటును అందించాలని కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో భద్రత, రక్షణ వ్యవహారాల విషయంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని,

సమావేశాల సమయంలో ధర్నాలు, ర్యాలీలకు అనుమతులు విషయంలో ఆచీతూచీ చర్యలు చేపట్టాలని చైర్మన్ సూచించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమావేశాలు నిర్వహించాలని, అందుకు తగినట్లుగా ఆయా విభాగాల అధికారులు ఏర్పాట్లు చేయాలని, ఉన్నతాధికారులు దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షించాలని కోరారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సాధ్యమైనంత త్వరగా సమాధానాలు ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచించారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో మంత్రులు అందరూ అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. అసెంబ్లీ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. శాసనసభకు ఎన్నికైన నూతన సభ్యులకు ఓరియంటేషన్ ప్రోగాం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా శాసనసభా వ్యవహారాల శాఖామంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కో-ఆర్డినేట్ చేసేందుకు, త్వరితగతిన సమాధానాలు సభ్యులకు అందించేందుకు ఒక సీనియర్ ఐఎఎస్ అధికారిని కో-ఆర్డినేటర్‌గా నియమించాలని చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. ఈ సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలు

ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీకి సూచించారు. ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి తప్పిదాలు జరుగవద్దని, గతంలో ప్రోటోకాల్ విషయంలో తాను కూడా బాధితుడినేనని మంత్రి గుర్తు చేసుకున్నారు. శాసనమండలిని పాత అసెంబ్లీ భవనంలోకి షిఫ్ట్ చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని, సమస్యలు ఏమైనా ఉంటే కూడా వెంటనే పరిష్కరించాలని ఆయన చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. కొత్త సభ్యుల కోసం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఓరియంటేషన్ కార్యక్రమాలు చేపడతామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News