Wednesday, January 22, 2025

పార్టీల ప్రచారంలో కార్యకర్తల ట్రిపుల్ యాక్షన్

- Advertisement -
- Advertisement -

పెయిడ్ కార్యకర్తలతో ప్రచారం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుత ఎన్నికల సీజన్‌లో అన్ని రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంక్‌ను కాపాడుకునేందుకు, అదనంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పలు పార్టీలకు ప్రచారం లో కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. పార్టీ స్థాయిని బట్టి ఎంత లేదన్నా సదరు పార్టీ ప్రచారానికి 50 నుంచి 100కు తగ్గకుండా చూసుకోవాల్సి వస్తోంది. అంతకంటే తగ్గితే ప్రచారాన్ని వాయిదా వేసుకోవడం లేదా.. సమయాన్ని మార్చుకోవడం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ముఖ్యంగా ఇంటింటి ప్రచారం, వీధుల్లో నిర్వహస్తున్న ర్యాలీల్లో ఈ లోటు స్పష్టంగా కనిపిస్తోంది.దాన్ని అధిక మించేందుకు నాయకులు శాయశక్తులు కృషి చేస్తున్నారు. వీటిలో భాగంగా స్థానికంగా ఉంటూ కొద్దిపాటి పరిచయాలు ఉన్న వారిపై దృష్టి సారిస్తున్నారు. వీరిలో కొంత మంది పార్టీ ప్రచారాలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో మిగిలిన వారికి కొంత మొత్తం ఆశచూపి వారిని తమ వెంట తిప్పుకుంటున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కొంత మంది కార్యకర్తలు నాయకులు జెండాలు మారుస్తున్న సులభంగా వారు కూడా కొంత సమయాన్ని ఒక పార్టీకి, మరి కొంత సమయాన్ని మరో పార్టీకి కేటాయిస్తూ అవసరాన్ని బట్టి ద్విపాత్రాభినయం లేదా త్రి పాత్రాభినయం కూడా పోషిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఇందేంటని ప్రశ్నిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఓటరు నాడిపట్టడం అంతసులభం కాదని, వారు ఎవరికి ఓటు వే యాలని భావిస్తే వారికే ఓట్లు వేస్తారని సమాధా నం చేబుతున్నారు. ప్రస్తు తం పార్టీల ప్రచారంలో అన్ని పార్టీలు కార్యకర్తల కొరతను ఎదుర్కొనడంతో పెయిడ్ కార్యకర్తలపై ఆధారపడక తప్పడం లేదు. అయితే పార్టీల ప్రచారంలో పాల్గొంటున్న కొంత మంది పెయిడ్ కార్యకర్తలను గుర్తుపడుతున్న కొంత మంది ఇదేం చోద్యం అంటూ ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు.పార్టీల ప్రచారంలో విరివిగా పాల్గొంటున్న పెయిడ్ కార్యకర్తలు ఎంతో వరకు సదరు పార్టీల విజయంలో కీలక పాత్ర పోషిస్తారో అనేది ఫలితాలు వచ్చేవరకు వేచిచూడాల్సిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News