Thursday, December 26, 2024

తెలంగాణ రిజల్ట్ డే: రాష్ట్ర వ్యాప్తంగా 49 కేంద్రాల్లో కౌంటింగ్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మరికొద్దిసేపట్లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం 131 టేబుళ్లు సిద్ధం చేశారు. ఈఎన్నికల్లో 2290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొదటి ఫలితం భద్రాచలం, చివరిగా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఫలితం వెళ్లడయ్యే అవకాశ ఉంది.

నియోజకవర్గానికి కేటాయించిన టేబుళ్ల వద్దకు ఎలక్షన్ సిబ్బంది, అభ్యర్థుల ప్రతినిధులను గరిష్ఠంగా 14 మంది ఏజెంట్లను అనుమతిస్తారు. ఆ లెక్కింపు కేంద్రం పరిశీలకుడు మినహా మిగతా ఎవరికీ సెల్ ఫోన్ తీసుకు వచ్చే అధికారం లేదని ముందుగా ఈవీఎంలను పరిశీలిస్తారని ఎన్నికల అధికారులు తెలిపారు. సీల్ ట్యాంపరింగ్ జరగలేదని నిర్ధారించుకునేందుకు ఆ టేబుల్ దగ్గర ఉన్న సిబ్బంది, ఏజెంట్లు ఈవీఎంను పరిశీలిస్తారు. ఈవీఎంల సీల్ పై ఏజెంట్లకు అనుమానం కలిగితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయవచ్చన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News