- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. 11 గంటల నుంచి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలుకు ఈ నెల 10 చివరి తేదీ. 13న నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, అభ్యర్థులు ఈ నెల 15లోగా తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి దశలోనూ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల అధికారులను ఆదేశించింది.
- Advertisement -