Wednesday, January 22, 2025

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు… నవంబర్ 30న పోలింగ్… డిసెంబర్ 3న ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ప్రకటించారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఆయన ప్రకటించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనావళి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్: నవంబర్ 30

నామినేషన్లు ప్రారంభం: నవంబర్ 3

నామినేషన్ల చివరి తేదీ: నవంబర్ 10

నామినేషన్ల పరిశీలన: నవంబర్ 13

నామినేసన్ల ఉపసంహరణ గడువు: నవంబర్ 15

ఎన్నికల ఫలితాలు: డిసెంబర్ 3

ఎన్నికల ముగింపు: డిసెంబర్ 5

 

తెలంగాణలో మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణలో 80 ఏళ్లు పైబడిన వారు 4.43 లక్షలు మంది వృద్ధులు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో తొలిసారి 8.11 లక్షల మంది యువత తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంతో మొత్తం దివ్యాంగుల సంఖ్య 5.06 లక్షలు, సర్వీసు ఓటర్లు 15,338 మంది ఉన్నారు. తెలంగాణలో 12 ఎస్‌టి, 19 ఎస్‌సి అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News