Friday, December 20, 2024

నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -

పశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్

మన తెలంగాణ/మేడ్చల్ జిల్లా: ఎన్నికల నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో స్వీప్ కార్యక్రమాలు, ఫిర్యాదులు, ఎన్నికల ఖర్చులు, ఎన్‌ఐసి, ఎంసిఎంసి, ఎంసీసీ నోడల్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల ఫిర్యాదుల విషయమై లా ఆఫీసర్ చంద్రావతిని అడిగి తెలుసుకున్నారు. అందిన ఫిర్యాదులపై సత్వరం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో చేపడుతున్న స్వీప్ కార్యక్రమాలపై జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి పద్మజారాణిని ఆరా తీశారు.

ఈ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా యువత పోలింగ్‌లో పాల్గొనేలా చూడాలని, మరింత విస్తృతంగా ఓటు ప్రాధాన్యతను తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. ఎన్‌ఐసి ఆధ్వర్యంలో చేపట్టిన పనులపై నోడల్ అధికారులు సుహాసిని, భానుప్రకాష్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. ఎంసీఎంసీ ఆధ్వర్యంలో మీడియా మానిటరింగ్ కమిటీ చేపట్టిన అంశాలపై డిపిఆర్‌వొ కిరణ్ కుమార్‌తో మాట్లాడారు. మోడల్ కండక్ట్ ఆఫ్ కోడ్ టీమ్స్, ఎన్నికల ఖర్చులకు సంబంధించి ఆయా విభాగాల నోడల్ అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News