Tuesday, April 1, 2025

గ్రేటర్‌లో పోటా పోటీ ప్రచారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రేటర్ వ్యాప్తంగా పోటా పోటీ ప్రచారం నెలకొంది. బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపితోపాటు ఎంఐఎం, బిఎస్‌పి, పార్టీల మధ్య పోటా పోటీ ప్రచారం కొనసాగుతోంది. అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లుగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తమ మంది మారుబలంతో అభ్యర్థులందరూ బస్తీలు, కాలనీల వారిగా ఉదయం 7 గంటల నుంచే ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తు ఓటర్లను కలిసి తనకే ఓటువేయాలంటే అభ్యర్థిస్తున్నారు.

అదేవిధంగా తిరిగి సాయంత్రం 4 గంటల తర్వాత ప్రచారాన్ని ప్రారంభిస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు రాత్రి 8 నుంచి 9 గంటల వరకు కొనసాగిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. మధ్యాహ్నం వేళా తమ తమ ప్రచారం సరళిపై వ్యూహ రచనలు చేస్తుకుంటు ముందుకు సాగుతున్నారు. మరోవైపు ప్రచార రధాలు ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గాలను చుట్టి వస్తుండగా అందులోని కళాకారులు తమ ఆట పాటలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News