Sunday, December 22, 2024

ప్రచారంలో ముందున్న బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

గ్రేటర్ వ్యాప్తంగా బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ప్రచారం మరింత ఉదృత్తం కానుంది. ఇప్పటికే గత రెండున్నర నెలల కిత్రం అభ్యర్థుల ప్రకటన మొదలు ఆపార్టీ అభ్యర్థులందరూ మూడు దఫాలుగా ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. నామినేషన్లు, ఉపసంహరణల పర్వం ముగియడంతో గురువారం నుంచి తమ చివరి దశ ప్రచారాన్ని ప్రారంభించారు.

బిఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు నేటి నుంచి రోడ్ షోలను ప్రారంభించనున్నారు. గ్రేటర్ పరిధిలో మొత్తం 24 నియోజకవర్గాలుండగా రోజువారిగా రెండు నుంచి మూడు నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈనెల 25వ తేదీన ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News