Friday, December 20, 2024

నేడు ఈవిఎంల్లో నిక్షిప్తం కానున్న ప్రజా తీర్పు

- Advertisement -
- Advertisement -

అభ్యర్థుల్లో టెన్షన్… టెన్షన్…

మన తెలంగాణ /సిటీ బ్యూరో : అభ్యర్థుల్లో గుండెల్లో దడ మొదలైంది… నేడు ఓట్ల రూపంలో ప్రజా తీరు ఈవింలో నిక్షిప్తం కానున్నాయి… గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఎవరీ రాత ఏలా ఉండబోనుందోనని అభ్యర్థులకు టెన్షన్ పట్టుకుంది. అయితే పైకి మాత్రం ఎవరీకీ వారే విజయం తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలతో పొల్చితే ఈసారి అందరీకీ ఈ ఎన్నికల పూర్తిగా టప్‌గా మారాయి. గ్రేటర్ వ్యాప్తంగా గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాలు నల్లేరు మీద నడకలా సాగాయి.

అయితే ఈ సారి మాత్రం కాంగ్రెస్ నుంచి అనుహ్యంగా ఊహించి పోటీ ఎదురు కావడంలో విజయం తమదేనని ఏ పార్టీ అభ్యర్థి కూడ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బిజెపి సైతం చివరి వారం రోజుల్లో ప్రచారాన్ని పూర్తిగా హోరెత్తించింది. అంతేకాకుండా గ్రేటర్ వ్యాప్తంగా బిజెపి అభ్యర్థుల మద్దతుగా పలువురు కేంద్ర మంత్రులు , బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహించారు. మరోవైపు గ్రేటర్‌ను పూర్తిగా ప్రభావితం చేసే విధంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకు 2 కిలొ మీటర్ల మేర రోడ్ షో నిర్వహించడంతో నగరంలోని ఆ పార్టీ అభ్యర్థుల్లో కొత్త జోష్ నింపింది.

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియంకా గాంధీలు ఎన్నికల ప్రచారం చివరి రోజున గ్రేటర్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వారి రోడ్ షోలు భారీగా జనం తరలి రావడంతోఈ రోడ్ షోలు తమకు కలిసివస్తుందనే సంతోషంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు బిఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్ని తానై గ్రేటర్ పరిధిలో రోడ్ షోలతో సుడిగాలి ప్రచారం నిర్వహించారు.

ఆయన తన రోడ్ షోలతో అదుర్స్ అనిపించారు. ప్రచారంలో భాగంగా తనదైన వాగ్దాటితో మంత్రి కెటిఆర్ ప్రత్యర్థి అభ్యర్థుల గుండెలు గుబులు రేపారు. బిఆర్‌ఎస్ , కాంగ్రెస్ , బిజెపి ఇలా మూడు పార్టీలు పోటా పోటీగా తమ తమ ప్రచారాన్ని నిర్వహించాయి. దీనికి తోడు ఎంఐఎం పార్టీ పాతబస్తీలో చాపకింద నీరు తమ ప్రచారాన్ని కొనసాగించింది. దీంతో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు సంబంధించి పాతబస్తీలోని 7 స్థానాల్లో నాంపల్లిలో మాత్రం ఎంఐఎం , కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నగా మిగిలిన స్థానాల్లో మాత ఎంఐఎం, బిఆర్‌ఎస్ మధ్య పోటీ కనిపిస్తోంది. గ్రేటర్‌లోని మిగిలిన స్థానాల్లో మాత్రం కొన్నిచోట్ల త్రిముఖ పోటీ నెలకొన్నగా మరికొన్ని నియోజకవర్గాల్లో ద్విముఖ పోటీ ఉంది.

ఓటెసేది ఎంత మందో… 
నగరంలో గత ఎన్నికల వరకు ఓటింగ్ 50 శాతం కూడ దాటని విషయం తెలిసిందే.. అయితే ఈ సారి మాత్రం 70 నుంచి 80 శాతం వరకు ఓటింగ్ నమోదైయే అవకాశం ఉందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల వరకు విద్యావంతులతో పాటు యువత రాజకీయాలకు సంబంధించి పెద్దగా పట్టించుకోకపోవడం, ఓటింగ్‌లో సైతం పాల్గొనేందుకు ఆసక్తి చూపకపోవడానికి కారణమైంది. అయితే గత 5 ఏళ్లతో పొల్చితే సోషల్ మీడియా విసృత్తంగా పెరగడం, ఇందులో యువత పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం, ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం అది మరింత పెరగడంతో ఓటింగ్ శాతం కూడ ఈసారి పెరిగే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఈ సారి అభ్యర్థులకు సైతం ఓటర్ల నాడి తెలుసుకోవడం కొంత కష్ట తరంగా మారందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో గ్రేటర్‌లో తమదే విజయమని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో అభ్యర్థులు టెన్షన్‌కు గురువుతున్నారు.

(బి.అంజన్‌కుమార్ యాదవ్ )

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News