Sunday, January 19, 2025

నగరంలో రాజుకున్న ఎన్నికల వేడి.. వెనకబడిన కాంగ్రెస్, బిజెపిలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో గ్రేటర్ రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. సోమవారం మధ్యాహ్నాం 12 గంటలకు భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడం, ఆ తర్వాత వెంట వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు జిల్లా ఎన్నికల విభాగం మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరం రాష్ట్ర రాజధాని కేంద్రం కావడం ఇక్కడి నుంచే అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికీ వ్యూహా, ప్రతి వ్యూహాలో రచించడంలో నిమగ్నం కావడంతో పోలింగ్‌కు మరో 50 రోజులు గడువు ఉన్నా నగరంలో మాత్రం మంగళవారం నుంచే పూర్తిగా ఎన్నికల వాతావరణం నెలకొంది.

రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు పట్టుదలతో ఉండడంతో రాజకీయం మరింత రసవత్తంగా మారింది. గ్రేటర్ పరిధిలో 25 నియోజక వర్గాలు ఉండగా గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ 15 నియోజకవర్గాల్లో విజయం సాధించిన బిఆర్‌ఎస్ మెజార్టీ స్థానాల కైవసం చేసుకోగా, ఎల్‌బినగర్ నుంచి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మహేశ్వరం నుంచి మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కాంగ్రెస్ నుంచి గెలిచి బిఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ పార్టీ స్థానాలు 17కు చేరాయి. అదేవిధంగా ఎంఐఎం 7 స్థానాల్లో , బిజెపి గోషామహాల్ గెలుపొందాయి.అయితే మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు బిఆర్‌ఎస్ పార్టీ ఈ సారి కూడ ఆయనకే టికెట్‌ను కేటాయించనప్పటికీ ఆయన మాత్రం ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరడంతో ఇక్కడ కొంత అనుహ్యా పరిణమాలు చోటు చేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News