- Advertisement -
హైదరాబాద్: గత జిహెచ్‌ఎంసి ఎన్నికల ఎవరూ ఊహించని విధంగా బిజెపి అన్యుహా విజయం లభించడంతో అదే ఊపును అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కొనసాగించేలా బిజెపి పార్టీ నేతలు కసరత్తును చేస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో బిజెపి కీలక నేతలను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించేందుకు రంగం సిద్దం చేస్తోంది. అదేవిధంగా కార్పోరేటర్లుగా గెలిచిన వారిలో బలమైన నేతలకు అసెంబ్లీ టికెట్లను కేటాయించడంపై సైతం ఆపార్టీ అధిష్టానం దృష్టి సారించింది. అయితే ఈ పార్టీ సైతం ఇప్పటి వరకు ఏ ఓక్క అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వెనకబడి పోయింది. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమీత్ షా తన రాష్ట్ర పర్యాటనలో భాగంగా నగరంలో సభ నిర్వహించినప్పటికీ అభ్యర్థులు పేరు ఖరారు కాకపోవడంతో ఎదో ఆలా సాగిందనిపించింది.
- Advertisement -