Wednesday, January 22, 2025

కమలంలో వీడని సస్పెన్స్… నారాజ్‌లో అధ్యక్షుడు

- Advertisement -
- Advertisement -

13 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సందిగ్ధత
నాలుగు స్థానాల్లోనే ఇప్పటివరకు ప్రకటన
నారాజ్‌లో జిల్లాపార్టీ అధ్యక్షుడు

రంగారెడ్డి : కమలదళంలో అభ్యర్థుల ఎంపిక కొలిక్కిరావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 17 స్థానాలకు గాను మొదటి జాబితాలో కేవలం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేసింది. మొదటి జాబితాలో తమ పేరు ఉంటుందని ఆశీంచిన నేతలకు చుక్కేదురు కావడంతో ఆలకపాన్పు ఎక్కారు. సీటుపై గంపేడు ఆశలు పెట్టుకున్న రంగారెడ్డి రూరల్, మేడ్చల్ ఆర్బన్ పార్టీ అధ్యక్షులు సైతం పార్టీ పెద్దల వ్యవహర తీరుపై నారాజ్‌లో ఉన్నారు.

మొదటి జాబితలో మహేశ్వరం నుంచి శ్రీరాములు యాదవ్, ఇబ్రహింపట్నం నుంచి దయానంద్ గౌడ్, కల్వకుర్తి నుంచి ఆచారీ, కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్‌లను అభ్యర్దులుగా ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలోని ఎల్.బి.నగర్, రాజేంద్రనగర్, చెవెళ్ల,షాద్‌నగర్, శేరిలింగంపల్లి, వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్, మేడ్చల్, కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి నియోజకవర్గాలకు అభ్యర్దుల ఎంపికలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఎల్.బి.నగర్ టికెట్ కోసం రంగారెడ్డి జిల్లా అర్బన్ పార్టీ అధ్యక్షుడు సామ రంగారెడ్డి చాలా ఆశలు పెట్టుకున్నారు. రంగారెడ్డి తో పాటు మదుసూదన్ రెడ్డి తదితరులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజేంద్రనగర్ టికెట్ కోసం కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ గౌడ్, బుక్క గోపాల్, నరేందర్ రెడ్డి, మల్లారెడ్డి,శ్రీదర్,బాల్ రెడ్డి తదితరులు దరఖాస్తు చేసుకుని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చెవెళ్ల టికెట్ కోసం ప్రకాష్, విజయ్‌కుమార్‌లతో పాటు పలువురు ఆశీంచిన నేడు బిఆర్‌యస్ నుంచి బిజెపిలోకి వస్తున్న మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నంకు టికెట్ పై హమీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. షాద్‌నగర్ టికెట్ కోసం మాజీ ఎంపి జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీవర్దన్ రెడ్డిలతో పాటు పలువురు ప్రయత్నాలు చేస్తున్న మరో వలస నేత కోసం వేచిచూస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది.

శేరిలింగంపల్లి టికెట్ కోసం యోగానంద్, రవికుమార్ యాదవ్‌లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి టికెట్ వచ్చిన మరోనేత సహకరించే సీన్ లేదు. వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాల్లో పోటి చేయడానికి చాలా మంది నేతలు దరఖాస్తులు సమర్పించిన బరిలో నిలిచి ఇతర పార్టీలకు కనీస పోటీ ఇవ్వగల సత్తా ఉన్న నాయకులు మాత్రం లేకపోవడంతో వేచిచూసే దొరణి అవలంబిస్తున్నారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి తట్టుకునే నేత లేకపోవడంతో బలమైన అభ్యర్థ్ది కోసం వెతుకుతున్నారు.

మాజీలకు దక్కని సీటు… మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీలకు సైతం మొదటి జాబితాలో సీటు దక్కకపోవడంపై పలు రకాల చర్చలు జరుగుతున్నా యి. ఉప్పల్‌లో మాజీ ఎ మ్మెల్యే ప్రభాకర్‌తో పాటు పలువురు నేతలు టికెట్ ఆశీస్తున్నారు. బిఆర్‌యస్, కాంగ్రెస్ పార్టీల తరపున బలమైన అభ్యర్దులు ఉండటంతో వారిని తట్టుకుని విజయం సాదించే అభ్యర్ది కోసం బిజెపి పెద్దలు వేచిచూస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది.

కాంగ్రెస్ పార్టీలో టికెట్ దక్కని నేతలతో పాటు సిట్టింగ్ బిఆర్‌యస్ ఎమ్మెల్యే సైతం నారాజ్‌లో ఉండటంతో వారు పార్టీలో చేరితే టికెట్ ఇచ్చి బరిలోకి దించాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మల్కాజ్‌గిరిలో మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు గతంలో పోటి చేసి పరాజయం పాలైన మరో సారి టికెట్ ఆశీస్తున్నారు. రాష్ట్ర పార్టీలో కీలకమైన వ్యక్తిగా పేరుగాంచిన రాంచంద్రరావుకు మొదటి జాబితాలో సీటు దక్కకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వలస నేతలకు టికెట్ దక్కే చాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. చెవెళ్ల సీటు కె.ఎస్.రత్నంకు పార్టీలో చేరకముందే ఖాయం చేసినట్టు మిగత నియోజకవర్గాల్లో సైతం అంతర్గతంగా ఒప్పందాలు జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అధ్యక్షులు నారాజ్… ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయడానికి రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్, మేడ్చల్ అర్బన్, మేడ్చల్ రూరల్ , వికారాబాద్ జిల్లాలుగా విభజించి అధ్యక్షులను నియమించారు.రంగారెడ్డి అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఎల్.బి .నగ ర్, రంగారెడ్డి రూరల్ అధ్యక్షుడు నర్సింహరెడ్డి మహేశ్వరం, మేడ్చల్ అర్బన్ అధ్యక్షుడు హరీష్ రెడ్డి కూకట్‌పల్లి, మేడ్చల్ రూరల్ అధ్యక్షుడు మేడ్చల్ నుంచి శాసనసభకు పోటి చేయాలని చాలా రోజులుగా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష హోదాలో తమకు మొదటి జాబితాలో సీటు ఖాయంగా దక్కుతుందని ఆశిస్తే కనీసం ఒక్కరికి కూడ చాన్స్ రాలేదు. మహేశ్వరం టికెట్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నర్సింహరెడ్డి ఆశీంచిన గత ఎన్నికలలో పోటిచేసి పరాజయం పాలైన శ్రీరాములుకు కేటాయించారు. సీటు దక్కని నర్సింహరెడ్డి నాటి నుంచి పార్టీపై నారాజ్‌తో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

అర్బన్, మేడ్చల్ రూరల్, అర్బన్ అధ్యక్షులు సైతం టికెట్ దక్కకపోవడంపై నారాజ్‌లో ఉన్న రెండవ జాబితాలోనైన చోటు దక్కుతుందన్న దింపుడు కల్లెం ఆశలో ఉన్నారు. టికెట్ దక్కని ఓ అధ్యక్షుడు పార్టీ మారడం ఖాయమన్న ప్రచారం సైతం ప్రారంబమైంది. టికెట్‌లు కేటాయింపులో జిల్లా పార్టీ అధ్యక్షుల కనీస అభిప్రాయం కూడ పరిగణలోనికి తీసుకోకపోవడం…టికెట్ దక్కని వారిని పిలిచి మాట్లాడే వారు సైతం కరువవ్వడంతో పార్టీ రథసారథులు ఎన్నికల సమయంలో చేతులు ఎత్తేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News