Saturday, January 18, 2025

గ్రేటర్‌లో గుబులు.. గెలుపుపై దిగులు

- Advertisement -
- Advertisement -

అభ్యర్థుల్లో కలవరపాటు,  గెలుపు ఓటములపై సర్వత్రా ఆసక్తి

అసెంబ్లీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్రేటర్ పరిధిలో (పటన్‌చెరు రెండు డివిజన్లు కలుపుకుని) మొత్తం 24 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు గెలుపు మాదంటే మాది అన్ని అన్ని పార్టీల అభ్యర్థులు ఎవరకీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఒకవైపు మాత్రమే మరో వైపు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు మాత్రం అపసోపా లు పడుతున్నారు. ఇందుకు కారణం ఈ ఏడాది రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడమే ఇందుకు కారణం.

గత అసెంబ్లీ ఎన్నికల అధికార బిఆర్‌ఎస్ పార్టీ గ్రేటర్ పరిధిలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకని విజయ దుందుభి మోగించింది. అయితే ఈసారి సైతం ఆ పార్టీ అదే ధీమాతో ముందు కు సాగుతుంది. అయితే ప్రస్తుతం మారిన రాజకీయాల నేపథ్యంలో ఏ ఒక్క అభ్యర్థి కూడా తాను ఖచ్చితంగా గెలుస్తామని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో పాటు తెలంగాణ జన సమితి, టిడిపి మహా కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేయగా ఒంటరిగానే బరిలోకి దిగిన అధికార బిఆర్‌ఎస్ పార్టీ గ్రేటర్ పరిధిలోని 24 స్థానాల్లో 14 స్థానాలను కైవసం చేసుకుంది. ఎంఐఎం పార్టీ 7 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2, బిజెపి 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. అయితే కాంగ్రెస పార్టీ అభ్యర్థిగా ఎల్‌బినగర్ నుంచి పోటి చేసి గెలుపొందిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో పాటు మహేశ్వరం నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి అధికార పార్టీలో చేరడంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

ఐదేళ్లలో పూర్తిగా మారిన రాజకీయం
గత ఎన్నికలతో పోల్చికుంటే ఈ ఎన్నికల నాటికి ఈ 5ఏళ్ల కాలంలో గ్రేటర్‌లో రాజకీయం పూర్తిగా మారిపోయింది. అధికార పార్టీ సంస్థగతంగానే కాకుండా అనేక అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా తనకు ఏ పార్టీ పోటీ కూడా ఇవ్వలేన్నంతగా బలపడింది. అయితే కొంతమంది ఎమ్మెల్యేల చర్యల కారణంగా అక్కడక్కడ కొంత వ్యతిరేఖత ఏర్పడిం ది. అంతేకాకుండా గత ఒకవైపు కాంగ్రెస్, మరో వైపు బిజెపి గడిచిన రెండేళ్ల కాలంలో రాజకీయంగా కొంత పుంజుకోవడం, ఒక దశలో ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్, బిజెపి మధ్యే పోటీ అన్నంతగా ట్రెండ్ కనిపించింది.

అయితే ఆ పార్టీ అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్‌కి స్థాన చలనం కల్పించడంతో పాటు తెలంగాణకు సంబంధించి కేంద్ర నాయకత్వ అలంబించిన ధ్వంద వైఖరి కారణంగా ఆ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. అప్పటికే మెల్లగా పుంజుకుంటున్న కాంగ్రెస్ గడిచిన 6 నెలల కాలంలో అనూహ్యంగా బలపడడంతో బిఆర్‌ఎస్, బిజెపి మధ్య అనుకున్న పోటీ కాస్తా బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యగా మారిపోయింది. అంతే కాకుండా బిఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికలలో పూర్తిగా సిట్టింగ్‌లకే కేటాయించడం అదికూడా ఎన్నికలకు దాదాపు రెండున్నర నెలల కిత్రమే అభ్యర్థులు ప్రకటించడమే కాకుండా ప్రచారంలో ముందువరుసలో ఉన్నారు.

అయితే బిఆర్‌ఎస్ అభ్యర్థులకు దీటుగా కాంగ్రెస్ పార్టీ సైతం గెలుపు గుర్రాల కోసం వేట మొదలు పెట్టడమే కా కుండా కొంత అలస్యమైనా దాదాపుగా అన్ని నియోజకవర్గాల నుంచి బలమైన అభ్యర్థులను రంగంలో దింపింది. బిజెపి సైతం గ్రేటర్‌లోని అన్ని స్థానాలకు పోటీ చేస్తోంది. మరోవైపు ఎంఐఎం తన పాత 7 స్థానాలతో పాటు ఈ సారి జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ నుంచి అభ్యర్థులను బరిలోకి దింపింది. దీంతో గ్రేటర్‌లోని 24 స్థానాలకుగాను ఎంఐఎం7 సిట్టింగ్ స్థానాలకు సంబంధించి 6 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం నల్లేరు మీద నడక కనిపిస్తుండగా నాంపల్లి నుంచి మాత్రం కాంగ్రెస్ రూపంలో గట్టి పోటీ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి విజ యం సాధించి బిఆర్‌ఎస్ ఈసారి ఎంఐఎం సైతం పోటీల్లో ఉండడం, బిజెపి, కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులు రంగం లో ఉండడంతో ఈ సారి పోటీ చత్రుముఖంగా మారింది.

(బి.అంజన్ కుమార్/మన తెలంగాణ)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News