Sunday, December 22, 2024

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా.. 5 బిల్లులకు ఆమోదం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొమ్మిది రోజుల పాటు అనేక విషయాలపై సభలో వాడివేడీ చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో మొత్తంగా ఐదు బిల్లులకు ఆమోదం లభించింది. దాదాపు 32 ప్రశ్నలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. 65 గంటల 33 నిమిషాల పాటు నిర్వహించగా రెండు ప్రశ్నలపై స్వల్పకాలిక చర్చ చేశారు. కాగా ఈ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

తెలంగాణ పూర్తి స్థాయి బడ్జెట్ రూ. 2,91,191 కోట్లతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన శుక్రవారం కాంగ్రెస్ సర్కారు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది. సివిల్ కోర్టు సవరణ బిల్లును సమర్ధిస్తూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ప్రభుత్వానికి కొన్ని సూచనలను చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెంచాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కోర్టులకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో కోర్టులు నిర్వహించడం బాధాకరం అన్నారు.

నియోజకవర్గాల్లో జూనియర్ సివిల్ కోర్టులు లేవన్నారు. కేసులు సత్వర పరిష్కారం కావాలంటే జూనియర్ సివిల్ కోర్టులు పెంచాలన్నారు. కోర్టుల అంశంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దాలన్నారు. తెలంగాణ సంక్షిప్త పదముల మార్పు బిల్లును బీజేపీ సమర్ధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News