- Advertisement -
రెండోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం శాసన సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి జరిగిన అన్యాయంపై సర్కార్ తీర్మానం చేయనుంది. అలాగే హైదరాబాద్ అభివృద్ధిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
ఇక, రైతు రుణమాఫీపై చర్చను వాయిదా ప్రభుత్వం వేసింది. గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల ఆందోళనపై ఉభయ సభల్లో బిఆర్ఎస్ వాయిదా తీర్మానం చేయనుంది
- Advertisement -