Saturday, December 21, 2024

కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం ప్రకటించనుంది. అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభ చర్చ చేపట్టనుంది. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిపిటి ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆస్తుల వివరాలతో భారత రాష్ట్ర సమితి బుధవారం డాక్యుమెంటరీని విడుదల చేసింది. కెసిఆర్ హయాంలో సృష్టించిన ఆస్తుల జామితాను రిలీజ్ చేసింది. ప్రభుత్వం చేస్తున్న అప్పుల ప్రచారాన్ని తిప్పికొట్టేలా బిఆర్ఎస్ ప్లాన్ రెడీ చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News