Monday, December 23, 2024

వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారు: మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసన మండలిలో మాట్లాడారు. ప్రజలకు 24 గంటల కరెంట్ కావాలి అనుకునే వాళ్లు బిఆర్ఎస్‌కి ఓటు వేస్తారు.. 24 గంటల కరెంట్ వద్దు అనుకునే వాళ్లు ఎవరైనా ఉంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారని హరీశ్ వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ వద్దు అంటున్నాడన్న ఆయన కాంగ్రెస్ ఉప నాయకుడేమో చెక్ డ్యాంలు వద్దు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ప్రజలకు లాభం లేదు అంటున్నాడని విమర్శించారు. ధరణి రద్దు చేయాలని ఇంకో కాంగ్రెస్ నాయకుడు అంటున్నాడు అని మంత్రి హరీష్ రావు సభలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News