Tuesday, March 18, 2025

బిసిలకు 42శాతం

- Advertisement -
- Advertisement -

బిసి రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధిద్దాం ప్రధాని మోడీని కలుద్దాం అపాయింట్‌మెంట్
ఇప్పించే బాధ్యత కేంద్రమంత్రులదే రిజర్వేషన్ల సాధనకు నేను నాయకత్వం వహిస్తా
జెండాలు, ఎజెండాలు పక్కనపెట్టి కెసిఆర్ సహా అందరం ఏకతాటిపైకి రావాలి
బలహీనవర్గాలకు న్యాయం చేయడమే మా ప్రభుత్వ విధానం కామారెడ్డి డిక్లరేషన్‌కు
కట్టుబడి ఉన్నాం అసెంబ్లీలో సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తమిళనాడు తరహాలో
కార్యాచరణ రూపొందించుకోవాలి : బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్ సూచన
జనాభా లెక్కన రిజర్వేషన్లు ఉండాలి : బిజెపి ఎంఎల్‌ఎ పాయల్ శంకర్

మన తెలంగాణ/హైదరాబాద్ : బిసిలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ల అమలుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా సోమవారం ఆమోదించింది. బిల్లు లకు ఆమోదం అనంతరం సభ నేటికి వాయిదా పడింది. ఈ బిల్లును త్వ రలోనే పార్లమెంట్‌కు పంపనున్నారు. అంతకుముందు శాసనసభలో బిసి ల రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ కెసిఆర్‌కు, బిజెపి నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా, జెండా, అజెండాలు పక్కన పెట్టి బిసి బిల్లుకు సహకరించాలని సిఎం రేవంత్ కోరారు. మనందరం వీలైనంత త్వరగా ప్ర ధాని నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా బిసి రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించుకుందామని సిఎం రేవంత్‌రెడ్డి పి లుపునిచ్చారు. బిసిలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు తాను నాయకత్వం వహిస్తానని ఈ సభా నాయకుడిగా మాటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

బిసి బిల్లుకై సహకరించిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బిల్లు ఆమోదానికి సహకరించిన సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. దీంతో కలిసికట్టుగా మనం ఉన్నామని సమాజానికి సంకేతం ఇచ్చామన్నారు. అలాగే, గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదన ఉపసంహరించుకున్నా మని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తెలిపారు. బిసి రిజర్వేషన్ల సాధన కోసం బిఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం, సిపిఐలతో పాటు అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుపోతామన్నారు. ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు.

అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్రమంత్రులదే
చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ జరగాలని రేవంత్ పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున చట్ట సవరణ కోసం ప్రధాని మోడీని, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీని అందరం కలిసి కట్టుగా కలుద్దామని ఆయన సూచించారు. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇప్పించే బాధ్యత కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదేనని ఆయన అన్నారు. ఇక, రాహుల్ గాంధీని కలిసే విషయం మా పిసిసి అధ్యక్షుడు తీసుకుంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. చట్టాలు మనకు అనుకూలంగా రాసుకున్నవేనని అందులో భాగంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేద్దామన్నారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం లేఖ రాయాలని సిఎస్‌కు ఆదేశాలిస్తున్నానని సిఎం చెప్పారు. బలహీనవర్గాలకు రిజర్వేషన్ల అంశంలో మనందరి అభిప్రాయాలు ఒక్కటే అయినప్పుడు ఒకరినొకరు విభేదించుకోవాల్సిన, విమర్శించుకోవాల్సిన అవసరం లేదని సిఎం రేవంత్ స్పష్టంచేశారు. బిసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించామని, ఆ ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నట్లు రేవంత్ చెప్పారు. ఈ మేరకు బిసి కులగణన చేశామని ఆయన తెలిపారు.

కామారెడ్డి ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నాం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బిసి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్‌గాంధీ ఆనాడు హామీ ఇచ్చారని సిఎం రేవంత్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు కులగణన చేశామని, ఫిబ్రవరి 4వ తేదీ 2024 నాడు కేబినెట్‌లో తీర్మానం చేశామని, మూడు కోట్ల 58 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న అందరికీ సిఎం కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో 75 వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారన్నారు. బిసి రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్‌కు ప్రతిపాదన పంపితే దానిని ఉపసంహరించుకొని 42 శాతం పెంచేందుకు కొత్త ప్రతిపాదన పంపిస్తున్నామని సిఎం చెప్పారు. 4 ఫిబ్రవరిని సోషల్ జస్టిస్ డే గా సభ ద్వారా తీర్మానం చేశామని అందరినీ సంప్రదించి బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు ఆయన చెప్పారు.

కులసర్వేలో పొందుపరిచిన బిసిల లెక్క వందశాతం సరైనవని బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. 1979లో మండల్ కమిషన్ వేశారని, మండల్ కమిషన్‌తోనే బిసి రిజర్వేషన్లకు చట్టబద్ధత ప్రారంభమయ్యిందని ఆయన తెలిపారు. బిసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించామని, కామారెడ్డి ప్రకటనకు తాము కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. సుప్రీం కోర్టు, జనాభా ఎంతో తేల్చకుండా రిజర్వేషన్ ఇవ్వలేమన్నదని, అందుకే తెలంగాణలో సర్వే చేశామని, లెక్కలు నూటికి నూరు శాతం కరక్ట్ అని ఆయన అన్నారు. బలహీన వర్గాల 56.3 శాతం జనాభా ఉందని, ఈరోజు తీర్మానం కాదు చట్టం చేశామని ఆయన తెలిపారు. బిసిలు పాలితులు కాదు పాలకులు అవ్వాలని ఆయన కోరారు. అందుకు మేం కృషి చేస్తున్నాం, మాకు వచ్చిన నాలుగు ఎమ్మెల్సీల్లో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు అవకాశం కల్పించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News