Sunday, December 22, 2024

రెండు స్థానాల్లో సిఎం కెసిఆర్ పోటీ..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. కొద్దిసేపటిక్రితం తెలంగాణ భవన్ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సిఎం కెసిఆర్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గజ్వేల్‌, కామారెడ్డి నియోజకవర్గ స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. దాదాపు సిట్టింగ్ అభ్యర్థులకే సిీట్లు కేటాయించినట్లు సిఎం చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఏడుగురు అభ్యర్థులను మార్చామని తెలిపారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు కంటోన్మెంట్‌ సీటు, పాడి కౌశిక్‌రెడ్డికి హుజూరాబాద్‌ సీటు, చల్మెడ లక్ష్మీనరసింహారావులుకు వేములవాడ సీటు కేటాయించినట్లు సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News