Sunday, December 22, 2024

సభలో కెటిఆర్.. డిప్యూటీ సిఎం మధ్య మాటల యుద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో అసెంబ్లీ ఉభయసభల్లో శనివారం చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కెటిఆర్.. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కెటిఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ… నిర్మాణాత్మక సూచనలు ఏవైనా స్వీకరిస్తామని తెలిపారు. బిఆర్ఎస్ నేతలు విమర్శలకు వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.

ఆర్ డబ్యూఎస్, ద్వారా కట్టిన వ్యవస్థలు, సంస్థలను బిఆర్ఎస్ నేతలు ధ్వంసం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిందే ఉమ్మడి పాలన వద్దనుకోని అన్నారు. 55 ఏళ్లలో ఏం చేశారని కెటిఆర్ ప్రశ్నిస్తున్నారని భట్టి విక్రమార్క వెల్లడించారు. పదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని మండిపడ్డారు. నల్లొండలో ప్లోరైడ్ గురించి గత కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేద అని ఉపముఖ్యమంత్రి ప్రశ్నించారు. పదేళ్లు విధ్వంసం అంటేనే 50 ఏళ్లు పాలన గురించి మాట్లాడినం అని కెటిఆర్ తెలిపారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల రూపాయలు వృథా చేశారని భట్టి తెలిపారు. తెలంగాణను రూ.5 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారరని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన చరిత్ర బిఆర్ఎస్ దేనని భట్టి విక్రమార్క పేర్కొన్నారు,

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News