Wednesday, January 22, 2025

అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14కు వాయిదా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 14కు వాయిదా పడ్డాయి. నాలుగు రోజులపాటు జరగనున్న రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశం ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ అధ్యక్షతన శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రాష్ట్ర శాసనసభలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను ఈనెల 14వ తేదీకి వాయిదా వేశారు. ఇక, స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈరోజు గడ్డం ప్రసాద్ స్పీకర్ నోటిఫికేషన్ కు నామినేషన్ వేయనున్నారు. ఏకగ్రీవంగా ఆయనను స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News