అసెంబ్లీ సమావేశాల పొడిగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశాలను ఆగస్ట్ 2వ తేదీ వరకు పొడిగించింది. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జోరుగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణలతో సభ హోరేత్తిపోతుంది. ఈ నేపధ్యంలోనే అసెంబ్లీ సమావేశాలను పోడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆగస్ట్ రెండో తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. సభలో 25వ తేదీన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. 26 వ తేదీన సెలవు ఉండటంతో 27న బడ్జెట్ పై సాధారణ చర్చతో పాటు డిప్యూటీ సీఎం సమాధానం ఉండనుంది.
తర్వాత 28 తేదీ మరో సెలవు ఉండగా 29 న 19 పద్దులపై చర్చతో పాటు ఆమోదం కూడా ఆరోజే ఉండనుంది. ఇక 30 న మరో 19 పద్దులపై చర్చించి, ఆమోదం తెలపనున్నారు. అలాగే 31 తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ, ఆమోదం జరగునున్నాయి. పొడిగించిన ఆగస్ట్ 1,2 తేదీలలో ప్రభుత్వ అజెండా, బిల్లులపై చర్చ చేపట్టనున్నారు. కాగా ముందుగా అసెంబ్లీ సమావేశాలు జూలై 31 వరకు జరిపించాలని నిర్ణయించినా చర్చలకు సమయం సరిపోదనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సభను ఆగస్ట్ 2 వరకు పొగించింది.